వెంటిలేటర్‌పై మన్మోహన్ సర్కార్ ..

వెంటిలేటర్‌పై మన్మోహన్ సర్కార్ ..

కేంద్రంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 సర్కారు వెంటిలేటర్‌పై శ్వాసపీల్చుతోందని, ఈ ప్రభుత్వం సరిగ్గా ఆర్నెల్లలో కుప్పకూలిపోతుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పుకొచ్చారు. 

దీనిపై ఆమె మాట్లాడుతూ... వెంటిలేటర్‌తో సాయంతో శ్వాస పీల్చుతున్న యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఏ అద్భుతమూ కాపాడలేదన్నారు. ఈ ప్రభుత్వం మహా అయితే రెండు నుంచి ఆరు నెలలు పాటే ఉంటుందన్నారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలొస్తాయని రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని వారు కూడా చెపుతున్నారని పేర్కొన్నారు. 

మన్మోహన్ సింగ్ సర్కారుకు ఎస్పీ, బీఎస్పీల అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి వారు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రభుత్వం ఆర్నెలల్లో కుప్పకూలిపోవడం తథ్యమన్నారు.