శశిధర్ రెడ్డి భేటీ ఆంతర్యం ఏమిటో!

 శశిధర్ రెడ్డి భేటీ ఆంతర్యం ఏమిటో!

కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అవడంతో మళ్లీ రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇస్తోంది.రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిబిరం గట్టిగా భావిస్తుంటే,శశిధర్ రెడ్డి తాజాగా సోనియాగాందీని కలవడం వెనుక ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా అన్న చర్చ జరుగుతోంది.అసమ్మతి వర్గం మాత్రం . రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నదని ప్రచారం చేస్తోంది. అయితే శశిధర్ రెడ్డి ని ముఖ్యమంత్రి పదవి విషయమై మాట్లాడుతారా?లేక తెలంగాణ మండలి ఛైర్మన్ పదవి నిమిత్తం సంప్రదింపులు జరుపుతారా అన్నది మీమాంసగా ఉంది.అయితే ఈ విషయాలపై మరి కొద్ది రోజులలో స్పష్టత వస్తుందని కూడా చెబుతున్నారు.