చంద్రబాబు పై ధ్వజమెత్తిన రఘువీరా

చంద్రబాబు పై ధ్వజమెత్తిన రఘువీరా

చంద్రబాబు నాయుడు అదికారంలో ఉన్నప్పుడు దుర్భిక్షం , ఇతర సమస్యలు వచ్చినప్పుడు మొత్తం తొమ్మిదేళ్లలో కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రెండువేల ఏడువందల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.అప్పట్లో ఎవరైనా ప్రకృతి వైపరీత్యాలకు గురై మరణిస్తే ఏభైవేల చొప్పున సాయం చేస్త, ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. అయితే ఈశాన్య రుతుపవతాలలో కురిసే వర్షాల పరిస్థితిని సరిగా అంచనా వేయడం వాతావరణ శాఖ విఫలం అయిందని ఆయన అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు ఆ శాఖ వద్ద లేవని,దీనివల్ల కూడా వర్ష ప్రభావంపై సరైన అంచనా రావడం సమస్య అయిందని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు.