ఢిల్లీ నుంచి దిష్టి బొమ్మలు- షర్మిల

ఢిల్లీ నుంచి దిష్టి బొమ్మలు- షర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మహిళా నేత, పాదయాత్రికురాలు షర్మిల ఉపన్యాసంలో కూడా పంచ్ డైలాగులు మొదలయ్యాయి.ఎన్.టి.ఆర్. పేరును ఆమె వాడుకోవడంతో పాటు కాంగ్రెస్ పై పంచ్ డైలాగులు విసురుతున్నారు. ఢిల్లీ నుంచి దిష్టిబొమ్మలను దింపుతున్నారని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ నుంచి సీఎం దిష్టిబొమ్మలను ఇక్కడ దింపుతోందని, త్వరలో కొత్త ముఖ్య మంత్రిని దింపినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి షర్మిల అన్నారు.వైఎస్సార్ తన పరిపాలనా కాలం లో రాష్ట్రంలో ప్రారంభించిన ప్రతి పథకానికీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టారని, కానీ ఆయన తదనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం తన తండ్రి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్పించిందని ఆరోపించారు. వైఎస్సార్ వల్ల కాంగ్రెస్‌కు జరిగిన మేలును విస్మరించి ఇలా ఆయనను అవమానించడం దారుణమన్నారు. వైఎస్ ఉన్నన్నాళ్లూ నీతివంతమైన పరిపాలనను అందించారన్నారు.