వాయలార్ ప్రకటన చేసినా మీడియా కు డౌటే!

వాయలార్ ప్రకటన చేసినా మీడియా కు డౌటే!

కేంద్ర మంత్రి వాయలార్ రవి స్పష్టంగా ముఖ్యమంత్రి కిరణ్ ను మార్చరని చెప్పినప్పటికీ బుధవారంనాడు పత్రికలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం కొంచెం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది.పైగా ఈనాడు పత్రిక అయితే మరిన్ని సందేహాలు లేవనెత్తుతూ బ్యానర్ కధనాన్నే ఇచ్చి, వాయలార్ రవి వ్యాఖ్యలను అడుగున ప్రచురించింది.వాయలార్ రవి ఇలా అన్నప్పట్టికీ , ఢిల్లీలో ఏదో జరుగుతోందన్న అనుమానం కాంగ్రెస్ వర్గాలలోను, ఆ మీదట మీడియాలోను ఉండడమే కారణమా? అన్న మీమాంస ఏర్పడుతోంది.ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఒక ప్రముఖుడి సన్నిహితుల కధనం ప్రకారం కిరణ్ ను మార్చాలన్న అబిప్రాయానికి వచ్చిందని, అయినప్పట్టికీ , దానిని బహిరంగ పరచడానికి అదిష్టానం సిద్దంగా లేదన్నది, మరి కొద్ది రోజులలో ఈ విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. ఇది నిజమే అయ్యే పక్షంలో కాంగ్రెస్ లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. పైగా కిరణ్, బొత్సల సన్నిహితులకే కొన్ని సందేహాలు వస్తున్నాయని పత్రికలు రాయడం ఆసక్తికరం. ఏది ఏమైనా వచ్చే పది రోజులలో అయినా ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందా?