All the public representatives has reversed their views after the agitation

All the public representatives has reversed their views after the agitation

ఆంద్ర ప్రదేశ్ విభజన లో ఏమాత్రం వెనక్కు తగ్గే ఆలోచన లేదు అంటున్న దిగ్విజయ్. ఈరోజు కూడా అదే మాట మిద నిలిచుని ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరిని ముందు సంప్రదించినప్పుడు వారు విభజనకు సుముఖంగా ఉన్నరు. అందువల్లనే విభజన నిర్ణయం తుసుకున్న ఇప్పుడు సీమంధ్ర లో మారుతున్న పరిస్థితులను చూసి వారు తమ తమ వాదనలు మార్చుకుంటే మేము ఎటు పోవాలి అని ప్రశ్నిస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి ఒక విశ్వాస పాత్రుడైన నేత అని వారిని మార్చే ప్రసక్తే లేదని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు తప్పనిసరిగా సహకరిస్తారని తనకు నమ్మకం ఉందని అన్నారు. సీమంధ్ర ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని ఎవరు అపనమ్మకం పెట్టుకోవలిసిన పని లేదని అన్నారు. మరొక సందర్భం లో వారు సీమంధ్ర లో సమ్మెలు చేస్తున్న ప్రజలకు, ఉద్యోగస్తులకు వారి వారి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈరోజుకి మనకు ఎవ్వరికి అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్ తరఫున ఒక్క దిగ్విజయ్ సింగ్ తప్ప మరెవ్వరు అధిష్టానం నుండి నోరు తెరిచి మాట్లాడకపోవడం ఆశ్చర్య జనకమ్. సోనియా గాంధీ గాని, మన్మోహన్ సింగ్ గాని ఈవిషయం లో ఏమి మాట్లాడవలిసిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా కనిపిస్తొన్ది. వారికి ఈ విషయం లో స్పందిన్చవలిసిన బాధ్యతా లేదా? ఈ మౌనం ఏమని ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయటం లేదు ఎందుకని?

సీమంధ్రకు సంబంధించిన మంత్రులు ప్రజా ప్రతినిధులు అందరు తమ తమ గళాలు విప్పి వారి వాదనలు అధిష్టానానికి వినిపించటం లేదా లేక వినిపించినా వారికి పట్టటం లేదా? ఈ మొండి వైఖరి ఎందుకు? ప్రత్యర్ధి పార్టీలు కుడా ఏమి చెయ్యలేక పోతున్నాఎమి? వారు సంపూర్ణ చిత్త శుద్ధి తో పోరాడటం లేదా లేక ఇదంతా కుమ్మక్కు రాజకియమేనా? చివరకు ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ ఏమవనుంది ఎవ్వరికి అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా అధిష్టానం తన వైఖరిని స్పష్టంగా చెప్పవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.