Akkineni has passed away

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు నిన్న రాత్రి నిద్ర లోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు అని నీరు నిండిన కళ్ళతో తన తండ్రి మరణాన్ని తెలియజేసారు వారి కుమారుడు నటుడు కధానాయకుడు అయిన నగర్జున. మన అభిమాన నటుడు అయిన నాగేశ్వర రావు సిని పరిశ్రమకు చేసిన సేవ ఎంత చెప్పినా తరగనిది అంటూ సిని ప్రముఖులు అందరు వారికి నివాళులు అర్పించారు. వారు ఎన్నో మరపు రాని పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వారు నటించిన ప్రతి చిత్రము ఒక ఆణిముత్యం. వారు సుమారు 260 చిత్రాలకు పైగా నటించారు. వారికి 91 సంవత్సరాలు. వారి నట జీవితం లో వారు ఎన్నో ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన నటులలో వారు ప్రముఖులు.