Shooting a movie to current standards

సాయంత్రాలు Coffee shop ల దగ్గిర నలుగురు చేరుతారు. Bold film-making అని డప్పు వేస్తూ వుంటారు. అదేంటి రా అని అడిగితే, S*x, Vi*lence, Dr*gs, Bl**d, M*sturbati*n, S*d*my లాంటి సమాజంలోని భయంకరమైన, జుగుప్సమైన చీకటి కోనాలని కళ్ళకి కట్టిన్నట్టు చూపించడం అంటారు.

Gaspar Noe, Anurag Kashyap, Lars von Trier, Takashi Miike అంటారు. అలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వాళ్ళకి అంత మంచి పేరుంది అంటారు. పైగా, "అబ్బే! ఇది మన తెలుగు వాళ్ళకి చేతకాదు" అంటారు. నాకు తాగుత ున్న ఆ వేడి వేడి coffee ని వాళ్ళ మొహాలకేసి కొట్టాలనిపిస్తుంది.

1941.

అప్పటికి మనకింకా స్వాతంత్రం కూడా రాలేదు. B. N. Reddy గారి దర్శకత్వంలో 'దేవత' అనే తెలుగు చిత్రం. B. N. Reddy అంటే పేరు కాదు. అదొక ప్రభంజనం! ఒక పద్మభూషణ్ Civilian Honour, ఒక Doctor of Letters Honour, ఒక దాదా సాహెబ్ ఫాల్కే Award! ఈరోజుల్లా Lobbying, Recommendations తెలియని, పనికిరాని రోజులవి. ఆ రోజుల్లోనే Sex, pregnacy, Pre marital, extra marital affairs లాంటి విపరీతమైన అంశాల్ని కళ్ళకు కట్టారు. అప్పటికీ ఇంకా వీళ్ళు చెపుతున్న ఈ Gaspar Noe, Tarantino...వీళ్ళ అమ్మా నాన్నల మధ్య sperm transfer కూడా అవలేదు.

అంతర్జాతీయ అవార్డులు మనకి రావా?

  • 1963 లోనే SV రంగారావు గారికి నర్తనశాలలో కీచకుని పాత్రకి Indonesian Film Festival Best Actor Award ఇచ్చారు.
  • 1986 లోనే విశ్వనాథ్ గారి స్వాతిముత్యం చిత్రాన్ని భారతదేశం నుండి Oscar కి అధికారికంగా పంపారు.

మాయాబజార్, భారతదేశంలోనే అతికొద్ది పరిపూర్ణమైన చిత్రాలలో మొదటి వరుసలో వుంటుంది. Sheer technical brilliance, a long way back. పుస్తకాలే రాయొచ్చు (వచ్చాయి కూడా!) దాని making మీద. 1957 లోనే boom poles పెట్టి live sound recording చేశారు.
మన చరిత్ర తెలుసుకోవాలి అనే తపన వుండదు. ఎప్పుడైనా జీవితంలో Google లో "Best Telugu Films" అని search చేశారా? చెయ్యరు! ఎప్పుడు చూడు, అదే "Best korean movies/Japanese/English/Vengeance or What ever the fuck it is!" అని వేల్లరిగే దాకా వెతుకుతూ వుంటారు. అతడు లో త్రిష అన్నది గుర్తుకువస్తుంది. "ఇంట్లో వున్న పూరీ నచ్చదు కానీ ఆ చపాతీ మొహంది మాత్రం కావాలి." ఒక జంతువు కూడా దాని territory ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది. మనమెందుకు ఇంత గొప్ప సినిమా చరిత్రని మరిచిపోతున్నాము? ఇష్టం వేరు. చిన్నచూపు వేరు. వాళ్ళని ఇష్టపడితే తప్పుపట్టట్లేదు, ఆ మైకంలో మనవాళ్ళని చిన్నచూపు చూడకూడదు అంటున్నాను. మారండి! చరిత్ర తెలుసుకోండి. గౌరవం దానంతటదే వస్తుంది. సాహిత్యానికి, సినిమాకి వాళ్ళు చేసిన సేవ చెత్తబుట్టల్లో, దుమ్ముపట్టిన VHS Tapeల్లో కాదు ఉండాల్సింది! మన మనసుల్లో! తెలుగు సినిమా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న భారీ dialog లు, item song లు కాదు! భారతదేశ చలనచిత్ర చరిత్రకి స్వర్ణయుగం (The Golden era of Indian Cinema) సంపాదించి పెట్టింది ఒక్క తెలుగు పరిశ్రమ మాత్రమే! ఇది తెలుగువాడిగా నా గర్వం కాదు. మనందరి ఘనత. చరిత్ర మర్చిపోవడం అంటే మన రక్తాన్ని మనం సందేహించడమే. అది మనకీ మంచిది కాదు. మన ప్రగతికీ మంచిది కాదు. మనందరం కోరుకునే ఆ సినిమా సూర్యోదయం త్వరలోనే మళ్ళీ వస్తుంది. అని నా మనసు బలంగా చెప్తుంది.